గ్రామానికి సమీపంలో మైనింగ్ పనులు నిలిపివేయాలి. . గ్రామసభలో రైతులు ఫిర్యాదు

Date:

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం ఫిరోజ్ నగర్ గ్రామనికి సమీపంలో నూతనంగా మైనింగ్ పనులు ప్రారంభించారని గురువారం గ్రామంలో జరిగిన గ్రామసభలో గ్రామానికి అతి సమీపంలో కొనసాగుతున్న మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు సర్పంచ్, కలకొండ జంగమ్మ, కార్యదర్శి అనిల్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, మైనింగ్ పనులు కొనసాగితే గ్రామానికి పలు తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మైనింగ్ వల్ల కలిగే సమస్యలు ప్రాథమిక పాఠశాలకు కేవలం 800 మీటర్ల దూరంలో ఉండటంతో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అంగన్వాడి కేంద్రం ,కొత్త గ్రామ పంచాయతీకి అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. చుట్టుపక్కల రైతుల పంట పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మైనింగ్ కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన గ్రామసభలో, స్పెషల్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి ,గ్రామ సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు మైనింగ్ యాజమాన్యంపై అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
గ్రామ ప్రజలు ఒకటిగా నిలిస్తే ఈ మైనింగ్ పనులను ఆపడం సాధ్యమని, గ్రామ హితం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

YSRCP-Jagan: వైసీపీకి భారీ డ్యామేజ్, జగన్ కొత్త రాజధాని ప్రకటనపై విమర్శలు!

Harish Rao: హరీష్ ఒంటరి! తెర వెనుక కేటీఆర్ వ్యూహం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...