ది బ్లాక్ లెవెల్ ఆర్టిజెన్సీ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో దొంగతనం

Date:

చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరులోని ప్రధాన వీధిలో ది బ్లాక్ లెవెల్ ఆర్టిజన్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ (తట్టబుట్టల సంఘం )ఉంది. ఇందులో 300 మంది సభ్యులుగా ఉన్నారు. రెండు ఏళ్ల క్రితం నూతన కార్యవర్గం కొలువుదీరింది. అయితే ప్రత్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా సభ్యులు తక్కువ మొత్తంలో హాజరు కావడంతో ఏలే సత్తయ్యతో పాటు మరి కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…. ఇంతవరకు బాగానే ఉంది. అయితే గత 20 ఏళ్లుగా సభ్యులకు సంబంధించిన వాటాదనం మొత్తం కూడా రూ. 12 లక్షల వరకు కూడా సంఘంలో జమ అయ్యాయి…. సభ్యులకు,కార్యవర్గానికి తెలవకుండా సదరు చైర్మన్ తన కొడుకు శేఖర్ ను మేనేజర్ గా చూపిస్తూ దొంగ చాటుగా తీర్మానం చేసి ఎస్బిఐ అకౌంట్ లో వీరిద్దరు సంతకాలు చేసి డబ్బులు డ్రా చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సదర్ కార్యవర్గ సభ్యుల వద్ద ఉన్నాయి. విషయం బయటకు పొక్కడంతో… కార్యవర్గ సభ్యులు పోలీసులను కూడా ఆశ్రయించారు… అయితే సదరు తండ్రీ కొడుకులు డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మబల్కుతూ రెండేళ్లుగా సదరు కార్యవర్గ సభ్యులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇటీవల కాలంలో సభ్యులు వెళ్లి అడగగా ఇక ఇస్తాం అగ ఇస్తామంటూ బొంకుతున్నారు…. డబ్బులు కాజేసిన దానికి సంబంధించి తాము న్యాయపోరాటం చేస్తామంటూ కార్యవర్గ సభ్యులు చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులను… కలెక్టర్ ను కలిసే యోచనలో ఉన్నారు.
ఇందుకు సంబంధించి మరింత సమాచారంతో ప్రైమరీలో కథనాలు వెలువడనున్నాయి.

క‌ల్తీ మామిడిపండ్ల‌పై త‌స్మాస్ జాగ్ర‌త్త‌…సీపీ స‌జ్జ‌నార్‌…!

క్రమశిక్షణ విషయంలో తగ్గేదే లేదు.. ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...