కౌంట్ డౌన్ షురూ.. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే..? మంత్రి పదవి గోవిందా?

Date:

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి అజారుద్దీన్ పదవికి సంబంధించిన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30వ తేదీ లోపు ఖచ్చితంగా శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ ఆరు నెలల గడువు ముగిసేలోగా చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కావాలి. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీ కాకపోతే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అజారుద్దీన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఖాళీగా ఉన్నప్పటికీ జెడ్పీ ఎన్నికలు పూర్తి కానందున అక్కడ ఇప్పుడల్లా ఎన్నిక జరిగే సూచనలు లేవు. మరోవైపు గవర్నర్ కోటాలోని మూడు స్థానాల గడువు నవంబర్ వరకు ఉంది. అయితే గడువు ముగియడానికి కొద్ది రోజులే ఉండటంతో అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఇప్పటికే సిఫార్సు చేసింది. గతంలో పంపిన సిఫార్సులపై న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కోర్టు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో గవర్నర్ నిర్ణయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

రాష్ట్ర మంత్రివర్గం గతంలో కోదండరాం సహా అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఈ అంశం కోర్టుకు చేరడంతో ఎమ్మెల్సీల నియామకం వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల ప్రకారం నియామక ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేవని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్ భవన్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుపై గవర్నర్ త్వరగా సంతకం చేస్తే అజారుద్దీన్ గండం గట్టెక్కుతారు. ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కేబినెట్ తీర్మానం చేస్తుందా లేదా పాత సిఫార్సుపైనే గవర్నర్‌ను కోరుతుందా అనే విషయం వేచి చూడాలి.

నిర్ణీత గడువులోగా ఎమ్మెల్సీ పదవి దక్కని పక్షంలో అజారుద్దీన్ తన మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది. రాజీనామా చేసిన అనంతరం తిరిగి మే 1న మంత్రిగా నియమితులైనా మరో ఆరు నెలల్లోగా అంటే అక్టోబర్ నాటికి మళ్ళీ సభకు ఎన్నిక కావాలి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. గడువు ముగిసేలోపు ఈ చిక్కుముడి వీడితేనే అజారుద్దీన్ మంత్రిగా నిరాటంకంగా కొనసాగే వీలుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ వ్యవహారం ఈ నెలాఖరుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: Vijayashanti: కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి.. సొంత ప్రభుత్వంపైనే విజయశాంతి విమర్శలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...