Telangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన…!

Date:

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జోన్-II (Zone-II) నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం రోజున శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన హైకోర్టు సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు. ఈ జోన్ సుమారు 60 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో న్యాయమూర్తుల నివాస విల్లాలు (సుమారు 60), సెంట్రల్ రికార్డ్ రూమ్ మరియు ఇతర అనుబంధ భవనాలు ఉంటాయి.

ఈ నిర్మాణ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు ₹2,583 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గతంలో, మార్చి 27, 2024న జోన్-I భవనాల (ప్రధాన కోర్టు భవనం మరియు కార్యాలయాలు) నిర్మాణానికి శంకుస్థాపన జరిగి, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...