Samantha: సమంత మరోసారి అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్.. కారణం ఇదే!

Date:

సమంత గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే సమంత సినిమాల వల్లే కాకుండా పర్సనల్ లైఫ్ వల్ల కూడా తరచూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ జంటగా గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు, నాగచైతన్య ప్రేమకథ చాలా మందికి ఎంతో ఇష్టమైన లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఏమాయ చేశావే సినిమా సమయంలో మొదలైన వారి పరిచయం తర్వాత ప్రేమగా మారి.. తరువాత పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి తర్వాత కూడా ఈ జంట చాలా సంతోషంగా జీవించారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు.

అయితే తర్వాత అనూహ్యంగా వారి మధ్య దూరం పెరిగింది. సమంత తన సోషల్ మీడియా నుంచి అక్కినేని అనే పేరు తొలగించడం, ఫోటోలు డిలీట్ చేయడం వంటి విషయాలు వార్తల్లో నిలిచాయి. చివరికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత కూడా సమంత ఎప్పుడూ అక్కినేని కుటుంబంపై నెగటివ్‌గా మాట్లాడలేదు. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని మరింత మంచి కోణంలో చూపించింది. మరోవైపు నాగచైతన్య తన జీవితంలో ముందుకు సాగగా, సమంత కూడా తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ఇక నాగచైతన్య ..శోభితను పెళ్లి చేసుకోగా.. సమంత ఈ మధ్యనే దర్శకుడు రాజ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి గురించి.. ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ సినిమా విడుదల సందర్భంగా సమంత ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది. ఆమె తన పోస్ట్‌లో సుప్రియ కష్టం, అంకితభావాన్ని ప్రశంసించింది.

విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబానికి ఇలా సపోర్ట్ చేయడం సమంత గొప్ప మనసుకు నిదర్శనం అని అభిమానులు భావిస్తున్నారు. గతాన్ని పక్కన పెట్టి మంచి సంబంధాలను కొనసాగించడం నిజంగా అభినందనీయమైన విషయం అని కామెంట్స్ చేస్తున్నారు.

 ALSO READ : Dacoit: టాలీవుడ్ నిర్మాతలందరి కళకళ్లూ డాకాయిట్ సినిమాపైనే.. ఎందుకంటే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...