Summer Drinks: చక్కెర లేకుండానే చల్లదనం.. డయాబెటిక్ వారికి టాప్ 10 డ్రింక్స్!

Date:

Diabetic Friendly Summer Drinks: వేసవిలో దాహం తీర్చడమే కాదు.. షుగర్ కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే!
వేసవి కాలం వచ్చేసరికి ఎక్కువగా దాహం వేస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఆసియా వంటి వేడి ప్రాంతాల్లో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. అయితే డయాబెటిస్ ఉన్నవారికి ఏ పానీయాలు మంచివి, ఏవి మంచివి కావు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో నీరు తగ్గిపోతే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన డ్రింక్స్ మాత్రమే ఎంచుకోవాలి.

ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
1.చక్కెర, బెల్లం, తేనె వంటివి కలపకూడదు
2.అవసరమైతే మాత్రమే ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వాడాలి
3. సోడా లేదా గ్యాస్ ఉన్న నీటిని వాడకూడదు

ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవారికి వేసవిలో మంచివైన 10 డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.

1. మజ్జిగ (Buttermilk)
మజ్జిగ మంచి ప్రోబయోటిక్. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

2. సత్తు డ్రింక్ (Sattu drink)
వేయించిన శనగపిండి లేదా జొన్నపిండి తో తయారుచేసే ఈ డ్రింక్ షుగర్ నియంత్రణకు మంచిది. ఇందులో జీలకర్ర పొడి, పుదీనా కలిపితే మరింత రుచిగా ఉంటుంది.

3. ఆమ్ పన్నా (Aam panna)
పచ్చి మామిడి తో చేసే ఈ పానీయం వేసవిలో చాలా చల్లదనాన్ని ఇస్తుంది. చియా గింజలు కలిపితే ఫైబర్ పెరుగుతుంది.

4. కొకమ్ శర్బత్ (Kokam sherbat)
కొకమ్ అనే పండు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీనిలో పుదీనా, నిమ్మరసం కలిపితే మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంటుంది.

5. ఉసిరి శర్బత్ (Amla sherbat)
ఉసిరి విటమిన్ C తో నిండినది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి ఆకులతో కలిపితే ఇంకా మంచిది. ముందుగా ఉసిరికాయను జ్యూస్ లాగా వేసుకొని అందులో కొద్దిగా ఐస్ వేసి ఆ తర్వాత తులసి ఆకులతో గార్నిష్ చేసుకోవాలి.

6. సోంపు శర్బత్ (Saunf drink)
సోంపు జీర్ణశక్తికి మంచిది. కాబట్టి సొంపు పొడిని చల్ల నీళ్లలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కలిపితే మరింత ఆరోగ్యం అందుతాయి.

7. అల్లం డ్రింక్ (Ginger drink)
అల్లం, నిమ్మరసం, చియా గింజలు.. చల్లనీలలో కలిపిన ఈ పానీయం శరీరాన్ని శుభ్రపరుస్తుంది. చల్లగా ఉంచుతుంది.

8. నిమ్మరసం + సబ్జా గింజలు (Lemon with sabja)
సబ్జా గింజలు ఫైబర్ అందించి షుగర్ నియంత్రణకు సహాయపడతాయి. సబ్జా గింజలు నానపెట్టిన చల్లతి నీళ్లలో నిమ్మరసం పిండి తాగితే ఎంతో మంచిది.

9. పాలకూర జ్యూస్ (Spinach juice)
పాలకూర, పుదీనా, కొత్తిమీర కలిపి చేసే ఈ జ్యూస్ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండినది. ఇది తక్కువ కాలరీల పానీయం.

10. కొబ్బరి నీరు (Coconut water)
ఇది సహజమైన ఎలక్ట్రోలైట్స్ అందించే పానీయం. శరీరానికి శక్తినిస్తుంది.. దాహాన్ని తగ్గిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...