Telugu Actress: ఆడపిల్లగా పుట్టడమే నేరం…భయంకరమైన నిజాలు బయటపెట్టిన నటి..!

Date:

ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. ముఖ్యంగా సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉంటాయి. తెరపై కనిపించినట్టు తెర వెనక వాళ్ళ జీవితం ఉండకపోవచ్చు. ఈ కక్రమంలోబుల్లితెరపై నవ్వులు పంచే కమెడియన్.. ఫైమా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు దాగి ఉన్నాయి. ఆమె తాజాగా ఒక టాక్ షోలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ చెప్పిన విషయాలు చాలా మందిని కలచివేశాయి.

ఫైమా చిన్నప్పటి నుంచే పేదరికంతో పోరాడింది. ఆమెకు కావాల్సిన సాధారణ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి కావు. పక్కింటి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే, తాను మాత్రం పాత బట్టలతో ఉండాల్సి వచ్చేదని ఆమె చెప్పింది. కొత్త డ్రెస్ కొనలేని పరిస్థితుల్లో..పాత బట్టల ముక్కలను కలిపి కుట్టించుకునేదాన్ని అని గుర్తుచేసుకుంది. ఆ రోజులు తనకు చాలా బాధ కలిగించాయని, కానీ అదే తనను బలంగా మార్చిందని ఆమె తెలిపింది.

ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఆమెకు సమస్యలు తగ్గలేదు. తన రూపం గురించి చాలా మంది చెడ్డగా మాట్లాడారని, “నల్లగా ఉంది, బాగోలేదు” వంటి మాటలు తనను చాలా బాధపెట్టాయని ఆమె చెప్పింది. ఒకసారి ఆ బాధను తట్టుకోలేక తన తల్లిని ఫోన్ చేసి “నన్ను ఇలా ఎందుకు కనేశావు?” అని అడిగిన సందర్భం ఉందని చెప్పి భావోద్వేగానికి లోనైంది.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ కూడా ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. తనపై వచ్చే కామెంట్లు తనకే కాకుండా తన కుటుంబానికి కూడా బాధ కలిగించాయని ఆమె చెప్పింది. అయినా కూడా ఆ విమర్శలను ఆమె బలంగా తీసుకుని ముందుకు సాగింది.

  • ఆడపిల్లగా పుట్టడమే నేరమా..!

ఫైమా మాట్లాడుతూ, ఆడపిల్లగా పుట్టడం వల్ల ఎదురైన కష్టాలను కూడా వివరించింది. కొన్ని సందర్భాల్లో తనకు జీవితం మీద నిరాశ కలిగిందని చెప్పింది. “ఆడపిల్లగా పుట్టడం తప్పేనా?” అనే ప్రశ్న తన మనసులో ఎన్నోసార్లు వచ్చిందని తెలిపింది.

  • నరేష్ తో ఆఫైర్..!

ఇక తన గురించి వస్తున్న రూమర్లపై కూడా ఆమె సరదాగా స్పందించింది. నదులు నరేష్ తో అక్రమ సంబంధం ఉందని వచ్చే వార్తలపై ఆమె జోక్ చేస్తూ చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు తనక చాలా నొప్పి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె నిజాయితీగా తన అనుభవాలను పంచుకోవడం చూసి చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...