రాజ్యసభ సభ్యుడిగా చింతకాయల విజయ్…!

Date:

పెద్దల సభకు అయ్యన్నపాత్రుడు కుమారుడు

సీనియారిటీ, సిన్సియారిటీకి పెద్ద పీఠ వేసిన చంద్రబాబు

లోకేష్ సైతం సానుకూలముద్ర

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఏపీ నుంచి నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే టిడిపికి రెండు, జనసేనతో పాటు బిజెపికి ఒక్కో పదవి కేటాయించనున్నట్లు సమాచారం. టిడిపి నుంచి పదవీ విరమణ చెందుతున్న సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇంకో పదవి మాత్రం సీనియర్ నేత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి జూన్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టిడిపి నుంచి సానా సతీష్ సైతం పదవీ సానా సతీష్ కు మరోసారి టిడిపి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏడాది కిందట ఆయన రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. అప్పట్లోనే మరోసారి అవకాశం ఇస్తామన్న ఒప్పందంతోనే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. అయితే మిగిలిన రాజ్యసభ పదవి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కు అవకాశం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయ్ కు ఇవ్వడం ద్వారా విధేయతతో పాటు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

టిడిపిలోనే అయ్యన్న ఫ్యామిలీ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం అదే పార్టీలో కొనసాగుతోంది. మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా వారు ఆ ట్రాప్ లో పడలేదు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని రకాల వేధింపులకు గురిచేసినా వెనుకడుగు వేయలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలుపొందుతూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. మధ్యలో ఒకసారి అనకాపల్లి ఎంపీ కూడా అయ్యారు. 2009, 2019లో ఓడిపోయిన అయ్యన్న 2024 లో గెలిచి అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. అయితే అయ్యన్నపాత్రుడుకు మించి ఆయన కుమారుడు విజయ్ టిడిపిలో ఒక సైనికుడిగా పని చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ దృష్టిలో ఉన్నారు. అందుకే ఆయన పేరును రాజ్యసభకు ఖరారు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

బలమైన నేతగా..
యువనేతగా ఉన్న విజయ్ గత 17 సంవత్సరాలుగా టిడిపి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. నర్సీపట్నంలో అంత తెర వెనుక ఉండి నడిపించారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. కానీ వివిధ సమీకరణలో దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్ల హయాంలో చింతకాయల విజయ్ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులు, పోలీస్ వేధింపులు, రాజకీయ దాడులను ఆయన ధైర్యంగా ఎదుర్కొనగలిగారు.

పార్టీ గలాన్ని సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో బలంగా వినిపించినందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా రకాల ఇబ్బందులు పెట్టింది. అయినా బ్రదర్ కూడా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చడంలో ఆయన చూపిన చొరవ చంద్రబాబుతో పాటు లోకేష్ లను ఆకట్టుకుంది. అందుకే ఈసారి చింతకాయల విజయ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...