ఎట్లా ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌పై దాడి.. పోలీసులకు ఫిర్యాదు!

Date:

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి :- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఎట్లా ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్ శంకరి నర్సిములుపై అదే గ్రామానికి చెందిన మల్కి నర్సిములు మరియు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు.సర్పంచ్ వివరాల ప్రకారం, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటించి గోడ నిర్మాణ పరిమితిని సూచించారు. ఈ నేపథ్యంలో మల్కి నర్సిములు ఫోన్ ద్వారా సర్పంచ్‌ను పిలిచి, గోడ నిర్మాణంపై వివరణ కోరినట్లు తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన మల్కి నర్సిములు, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సర్పంచ్‌పై దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ పిసర్ సురేందర్ రెడ్డి, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అనంతరం సర్పంచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మల్కి నర్సిములతో తమకు ప్రాణహాని ఉందని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ వేణుగోపాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఎన్నికల్లో ఓటమి కారణంగా గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరైంది కాదన్నారు.గ్రామస్తులు కూడా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం గ్రామ ప్రయోజనానికి సంబంధించినదని, వ్యక్తిగత ద్వేషాలతో అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదని అభిప్రాయపడ్డారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

తాజ్ పూర్ లో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా, బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

సింగల్ గానే ఉంటా.. పెళ్లిపై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...