రెండు సంవత్సరాలలో ఐదువేల ఆలయాలు నిర్మించాలి : సీఎం చంద్రబాబు

Date:

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు నిర్మించాలి అని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవాణి ట్రస్టు నిధులతో రాబోయే రెండు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 ఆలయాలు నిర్మాణం పూర్తి చేయాలి అని వెల్లడించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 25 నుంచి 30 దేవాలయాలు నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ప్రసిద్ధిగాంచినటువంటి సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, శ్రీకాళహస్తి మరియు కాణిపాకం వంటి దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు విన్నపించారు. ఇక మిగతా ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని ఆలయాలకు సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ప్లాన్లు వేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఏడాది ఆలయాలకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడం అలాగే తొక్కిసులాట కారణంగా కొంతమంది చనిపోయిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆలయాలను పునరుద్ధరించాలి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల సంఖ్య అనేది భారీగా పెరగనుంది. కాగా గత ప్రభుత్వంలో ఆలయాలను ధ్వంసం చేయడము అలాగే దేవాలయాలను పట్టించుకోని సందర్భంలు చూశాం. ఎలక్షన్ల సమయంలో ఆలయాలను రూపుదిద్దే బాధ్యత మాది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు తెలిపిన విధంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలను సరికొత్తగా రూపుదిద్దరం మాత్రమే కాకుండా నూతన ఆలయాలను కూడా నిర్మించాలి అని డిసైడ్ అయ్యారు.

నేడు ఆసక్తికర మ్యాచ్.. కోల్కతా భోణి కొడుతుందా..?

ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా బుమ్రా విఫలం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...