Breaking: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా…!

Date:

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) 2026 మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా సన్నాహాలు చేస్తోంది. జూలై 10, 2025 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసిన జాబితా ఆధారంగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశించింది. ఓటర్ల వివరాల్లో ఏవైనా లోపాలుంటే ఈ నెల ఏప్రిల్ 23, 2026 లోపు నివేదించాలని కలెక్టర్లకు సూచించింది.

అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్తుల పదవీకాలం గత ఏడాది జూలైలోనే ముగిసింది. అప్పటి నుండి ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఫిబ్రవరి 2026లో ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ముగిసిన వెంటనే, మే నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...