క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రబీ ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేసి, మిల్లులకు తరలించడానికి అవసరమైన లారీలను పెంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించడానికి అవసరమైన లారీల సంఖ్యను వెంటనే పెంచాలని సూచించారు. ఎక్కడా ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష..!
Date:


