TG Yellow Alert: పగటిపూట ఎండ…సాయంత్రం ఈ వర్షాలు..!

Date:

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో ఏర్పడిన ద్రోణి (Trough) ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు (ఏప్రిల్ 24 వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని అధికారులు సూచించారు. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, సాయంత్రం వేళల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలిపారు.

ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 24 వరకు వర్ష సూచన ఉంది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల వడగళ్ల వర్షం (Hailstorm) కురిసే అవకాశం ఉందని IMD హైదరాబాద్ తెలిపింది.

హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు:

  1. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్.
  2. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్.
  3. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట.
  4. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...