అజారుద్దీన్ భవితవ్యం ఏంటి…?

Date:

ఎమ్మెల్సీ కాకుంటే మంత్రి పదవి వదులుకోవాల్సిందే

ప్లాన్ బి అమలు చేయనున్న సీఎం రేవంత్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మహమ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తు ఏంటి? ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనా? పదవి ఆరు నెలలకే పరిమితమా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ప్రచారం నడుస్తోంది. మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే. అందుకే రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్లాన్ బి అన్నట్టు టాక్ నడుస్తోంది. మరో ఐదు రోజుల గడువు ఉండడంతో రేవంత్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బైపోల్స్ లో గెలిచేందుకు..
జూబ్లీహిల్స్ బై పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సర్వశక్తులు వడ్డింది. ఆ నియోజకవర్గంలో ముస్లింలు అధికం. వారిని ఆకట్టుకునేందుకుగాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఆలోచన చేశారు. మంత్రివర్గంలోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తీసుకున్నారు. ఆ ప్రయోగం ఫలించింది. జూబ్లీహిల్స్ బై పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. నవంబర్ 30న తెలంగాణ మైనారిటీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆయన ఏ చట్టసభలో కూడా సభ్యుడు కారు. అందుకే ఎమ్మెల్సీగా ఆయన పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్ వద్దకు ఫైలు పంపించారు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ నెల 30 వరకు మాత్రమే సమయం ఉంది. గవర్నర్ ఏ నిర్ణయము తీసుకోకపోతే మాత్రం అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే.

కేంద్రం నుంచి ఒత్తిడి..
ఇటీవల పార్లమెంటులో రెండు బిల్లులు వీగిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. కానీ విపక్షాలు ఆ బిల్లును ఓడించాయి. అయితే ఆ బిల్లును తొలుత వ్యతిరేకించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం పేరిట. అయితే ఈ బిల్లును తొలుత వ్యతిరేకించింది రేవంత్ రెడ్డి కాబట్టి.. కేంద్రం నుంచి రేవంత్ కు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఫైల్ విషయంలో సైతం గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల నుంచి సహాయ నిరాకరణ తప్పదు. అయితే ఇప్పుడు రేవంత్ దీనిని ఆలోచించి ప్లాన్ బి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 30న అజారుద్దీన్ తో మంత్రి పదవికి రాజీనామా చేయించి.. ఆ వెంటనే మరి కొద్ది రోజుల్లో మంత్రిగా మళ్లీ ఎంపిక చేసి ప్రమాణస్వీకారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల సమయం ఉండడంతో ఎమ్మెల్సీగా సులువుగా ప్రమోట్ చేయించి మంత్రి పదవి కట్టబెడతారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...