మద్యం కుంభకోణంలో కొత్త కోణం…!

Date:

  • ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ

  • ఏకకాలంలో విస్తృత సోదాలు

  • విజయసాయిరెడ్డి ఇంట్లో సైతం

  • చెవిరెడ్డి ఇంటికి తాళం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మద్యం కుంభకోణం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈడి . సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు కృష్ణమోహన్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి తో పాటు ఇతర నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడి అధికారులు ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక, మరోవైపు సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో సోదాలు కొనసాగిస్తోంది ఈడి.

నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం
వైసిపి హయాంలో మద్యం కుంభకోణంలో 4 వేల కోట్ల రూపాయల వరకు పక్కదారి పట్టిందన్నది ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీలు భారీ అక్రమాలు జరిగాయని సీట్ తన నివేదికలో స్పష్టం చేసింది. అప్పట్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను నిలిపివేసి.. నగదు రూపంలోనే లావాదేవీలు సాగించడం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇలా ఈ కుంభకోణం ద్వారా వచ్చిన నల్లధనాన్ని విదేశాలకు మళ్ళించడమే కాకుండా.. బినామీ కంపెనీల పేరుతో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలను సేకరించగలిగింది.

సాయి రెడ్డి ఇంట్లో సైతం..
అయితే అన్నింటికీ మించి విజయసాయిరెడ్డి ఈ కేసులో విచారణ చేపడుతుండడం విశేషం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీట్ చాలామందిని అరెస్టు చేయగలిగింది కానీ.. విజయసాయిరెడ్డి జోలికి పోలేదు. ఆయన అప్రూవర్ గా మారడంతో అప్పట్లో విడిచి పెట్టారన్న కామెంట్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ డి విచారణను తప్పించుకోలేకపోయారు విజయసాయిరెడ్డి. ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో కూడా తనిఖీలు చేసింది ఈడి. హైదరాబాదులోని ఏకకాలంలో జరిపిన ఈ తనిఖీలు సంచలనంగా మారాయి.

చెవిరెడ్డి పరారీ..
ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు. సుదీర్ఘకాలం జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ డి విచారణ జరుగుతుందని తెలిసి ఆయన కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మద్యం కుంభకోణం కేసులో ఈడి ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. మున్ముందు ఈడి అరెస్టుల పర్వానికి దిగవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...