Tejas Mk2: రాఫెల్ ను తలదన్నేలా తేజస్ Mk2, భారత సైన్యంలోకి కొత్త ఫైటర్ జెట్!

Date:

Tejas Mk2 Ready for First Flight: భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేస్తున్న తేజస్‌ ఎంకే-2 యుద్ధవిమానం తొలి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ముందుగా టాక్సీ ట్రయల్స్‌ అంటే భూమిపై నడిపే పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఫస్ట్‌ ఫ్లైట్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.

శత్రువుకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం

ఇప్పటికే తేజస్‌ ఎంకే-1ఏకి చెందిన కొన్ని విమానాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, అవి ఇంకా భారత వాయుసేనలో పూర్తిగా చేరలేదు. అయితే, కొత్తగా రూపొందిస్తున్న ఎంకే-2 వెర్షన్‌ వాటికంటే మరింత శక్తివంతంగా ఉంటుంది. దీనిలో ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో పాటు, ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అలాగే ముందువైపు స్టెల్త్‌ సామర్థ్యం మెరుగ్గా ఉండటం వల్ల శత్రువుకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఎంకే-1ఏలో వాడిన జీఈ ఎఫ్‌-404 ఇంజిన్‌తో పోలిస్తే, ఎంకే-2లో జీఈ ఎఫ్‌-414 ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవే ఇంజిన్లు అమెరికా ఎఫ్‌-18 యుద్ధవిమానాల్లో కూడా వాడుతున్నారు. దీనివల్ల విమానం మరింత శక్తివంతంగా మారింది.

200 కిలోమీటర్ల లక్ష్యాలను గుర్తించే సత్తా

రేడార్‌ మరియు ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థల విషయంలో కూడా ఈ విమానం చాలా ముందుంది. ఇందులో ఉపయోగించే ఉత్తమ్‌ రేడార్‌ గాలియం నైట్రైడ్‌ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది సుమారు 200 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తిస్తుంది. శత్రువులు జామింగ్‌ చేసే ప్రయత్నాలను కూడా తట్టుకుని పనిచేయగలదు.

రాఫేల్ కు మించిన సామర్థ్యం

ఎత్తైన ప్రాంతాల్లో కూడా ఈ విమానం సమర్థంగా పనిచేస్తుంది. రఫేల్‌ విమానం 52 వేల అడుగుల ఎత్తు వరకు పనిచేస్తే, తేజస్‌ ఎంకే-2 సుమారు 56 వేల అడుగుల ఎత్తులో కూడా సమర్థంగా పనిచేస్తుంది.హిమాలయాల లాంటి కఠిన ప్రాంతాల్లో యుద్ధానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...