Breaking: అగ్నికి ఆహుతైన మరో బస్సు…డ్రైవర్, క్లీనర్ తో సహా..!

Date:

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మెదక్ సమీపంలోని జాతీయ రహదారి 44 (NH44) పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది కేవలం కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తానికి వ్యాపించింది. బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల సామాగ్రి కూడా మంటల్లో ఆహుతైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో డ్రైవర్, క్లీనర్ చూపిన అప్రమత్తత నిజంగా అభినందనీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...