శ్రీ‌కాకుళంలో ఘోరం…పిడుగు ప‌డి న‌లుగురు మృతి…! ప‌లువురికి తీవ్ర‌గాయాలు

Date:

శ్రీ‌కాకుళం, క్రైమ్ మిర్ర‌ర్ః శ్రీ‌కాకులం , తిరుప‌తి జిల్లాల్లో ఆదివారం భారీ వ‌ర్షం కురిసింది. నేడు మ‌ర్కాపురం జిల్లాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్ల‌ల‌చెరువులోని మొక్క‌జొన్న ఫ్యాక్ట‌రీపై పిడుగుప‌డ‌గా క‌న్న‌య్య‌(28) అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా మ‌రో న‌లుగురు తీవ్ర‌గాయాల‌య్యాయి. పిడుగుపాటుకు గురైన వారిని య‌ర్ర‌గొండ‌పాలెం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రిచి చికిత్స అందిస్తున్నారు. కాగా రాష్ర్టంలో వ‌రుసుగా పిడుగుప‌డి మృతి చెంద‌డం విషాదం నింపుతోంది.

పొలం ప‌నుల‌కు వెళ్లి అక్క‌డే పిడుగుప‌డి…

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బి.కేసుపురంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. అప్పటికే పొలం పనుల కోసం వెళ్లిన తల్లీకుమార్తె మడియ కృష్ణవేణి(35), మడియ యోగేశ్వరి(15) వర్షం కారణంగా చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో భారీ పిడుగుపడి వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే తిరుపతి జిల్లాలోనూ పిడుగుపాటు ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాళహస్తి మండలం కలవగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

క‌ల్లుగీసేందుకు వెళ్లి…

కల్లు గీసేందుకు వెళ్లిన కార్మికుడు వి.కామరాజ్(35)పై పిడుగుపడడంతో తుదిశ్వాస విడిచాడు. కామరాజ్‌ను వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...