ప్ర‌యాణీకుల‌కు శుభవార్త‌…ఈవీ స్టేష‌న్ల ఏర్పాటుకు ఆర్టీసీ శ్రీ‌కారం…!

Date:

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీజీఆర్టీసీ తన రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తోంది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ.. ఇప్పుడు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించింది. నగరంలోని అన్ని ప్రధాన డిపోల్లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి వచ్చేలా ఆర్టీసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్‌నగర్, హెచ్‌సీయూ వంటి కీలక డిపోల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా.. వచ్చే నెలలో కూకట్‌పల్లి స్టేషన్‌ను కూడా ప్రారంభించనున్నారు.నగరవ్యాప్తంగా మరో 13 కొత్త ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఫరూక్‌నగర్, బర్కత్‌పుర, మెహిదీపట్నం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, చెంగిచెర్ల, జీడిమెట్ల, కాచిగూడ, మిధాని, బండ్లగూడ, ముషీరాబాద్, జవహర్‌నగర్‌ డిపోలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఏడాది కాలంలోనే ఈ స్టేషన్లన్నింటినీ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు గడువు విధించుకున్నారు.

ఈ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే నగరంలోని వివిధ రూట్లలో ఎలక్ట్రిక్ బస్సుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయిరాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం.. రానున్న రెండేళ్లలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని డిసైడ్ . ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. నగరవాసులకు కాలుష్య రహిత, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...