ప్ర‌యాణీకులకు గుడ్ న్యూస్‌…ఫ్లై91’ స‌ర్వీసు ప్రారంభం…!

Date:

విజ‌య‌వాడ‌, క్రైమ్ మిర్రర్ : ప్ర‌యాణీకుల‌కు గుడ్ న్యూస్‌. ప్ర‌యాణాలు సుల‌భ‌త‌రంగా చేసేందుకు విజయవాడ-హైదరాబాద్ మధ్య ‘ఫ్లై91’ నయా విమాన సర్వీసు: ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్ర‌వారం ప్రారంభించారు.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి హైదరాబాద్‌కు ప్రముఖ ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ (Fly91) తన నూతన సర్వీసును ఈ రోజు అధికారికంగా ప్రారంభించింది.

న్యూఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కొత్త సర్వీసును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం విమానాశ్రయంలో విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ‘ఫ్లై91’ ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని చిన్న నగరాలను విమాన మార్గాల ద్వారా అనుసంధానించేందుకు (Regional Connectivity Scheme – UDAN) అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

విజయవాడ-హైదరాబాద్ రూట్ అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి అని, కొత్త సర్వీసు ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త‌గా ప్రారంభించిన ఫ్లై91 సేవ‌లు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ నుంచి బయలుదేరే సమయం: ఉదయం 7:30 గంటలకు, హైదరాబాద్ చేరుకునే సమయం: ఉదయం 8:40 గంటలకు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...