ఇరాన్‌కు భారీ షాక్‌…అమెరికా మ‌రిన్ని ఆంక్ష‌లు…!

Date:

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ఇరాన్‌, అమెరికా ఉద్రిక్త‌లు రోజు రోజుకు మ‌రింత ఎక్క‌వు అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ముడిచ‌మురు రంగంపై అమ‌రికా మ‌రిన్ని ఆంక్ష‌లకు తెర‌దీసింది. హార్మూజ్ జ‌లసంధి విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇరాన్‌ను ఆర్థిక‌ప‌రంగా దెబ్బ‌కొట్టేందుకు క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించింది. ఇరాన్ ఆయిల్్ ఇండ‌స్ర్టీకి చెందిన ప‌లువురు కీల‌క వ్య‌క్తులు, కంపెనీలు, స‌రుకు ర‌వాణ నౌక‌ల‌పై ఆంక్ష‌లు విధించామ‌ని అమెరికా ట్రెజ‌రీ బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఆంక్షలను ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తులు ఇరాన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీకి సంబంధించిన వారని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలను కష్టాల్లోకి నెట్టి ఆ కుటుంబం లాభపడుతోందని ఆరోపించారు.

హోర్ముజ్‌పై ఆంక్షలతో లాభపడుతున్న ఇరాన్‌ను కట్టడి చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ట్రెజరీ విభాగం మరో ప్రకటనలో పేర్కొంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకి సలహాదారు, ఇరాన్ భద్రత వ్యవహారాల అధికారి అయిన అలీ షమ్‌ఖానీ కుమారుడే మొహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీ. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌‌ దేశాలు చేసిన దాడిలో ఖమేనీతో పాటు అలీ షమ్‌ఖానీ కూడా మరణించారు.
ష‌మ్‌ఖానీ నెట్‌వ‌ర్క్ త‌ప్పించుకుంటోంది…

షమ్‌ఖానీ నెట్‌వర్క్‌కు చెందిన సంస్థలు ఇరాన్‌తో పాటు యూఏఈలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అమెరికా చెబుతోంది. కన్సల్టెన్సీలు, షిప్పింగ్ సంస్థల సాయంతో షమ్‌ఖానీ నెట్‌వర్క్ తమ ఆంక్షల నుంచి తప్పించుకుంటోందని తెలిపింది. గతేడాది కూడా ఈ నెట్‌వర్క్‌కు చెందిన పలు సంస్థలపై యూఎస్ ఆంక్షలు విధించింది. ఇక ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాకు ఆర్థికసాయం అందించే ఇరానీ వ్యక్తి సయ్యర్ బద్రొద్దీన్ ముసావీపై కూడా ఆంక్షలు విధించామని అమెరికా వెల్లడించింది. ఇరాన్ ముడి చమురు విక్రయాల నగదుతో మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న మరో మూడు సంస్థలపై కూడా ఆంక్షలు విధించామని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...