మోహన్ లాల్ కొడుకుతో కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి … నిజం ఇదే!

Date:

హైద‌రాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌ :మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఒక పెళ్లి వార్తహహ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.. స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల వల్ల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ వార్తలు మరింత వేగంగా వ్యాపించాయి.

కళ్యాణి, ప్రణవ్ కలిసి నటించిన హృదయం, వర్షాంగళక్కు శేషం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమాల్లో వారి జంటను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు. అందుకే ఈ రీల్ జంట నిజ జీవితంలో కూడా ఒకటవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. విషు పండుగ సమయంలో ఈ రూమర్స్ మరింతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

స్పందించిన కళ్యాణి తల్లి…!

అయితే ఈ వార్తలపై తాజాగా కళ్యాణి తల్లి, సీనియర్ నటి లిజి స్పందించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, ఈ పెళ్లి వార్తలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లే అని చెప్పారు. దీంతో ఈ ప్రచారానికి ముగింపు వచ్చినట్లైంది.

ఇక కళ్యాణి కూడా గతంలో ప్రణవ్‌తో తన సంబంధం గురించి మాట్లాడింది. అతను తనకు చిన్ననాటి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది. తమ మధ్య ఉన్నది అన్నాచెల్లెళ్ల బంధంలాంటిదని కూడా చెప్పింది. చిన్నప్పటి నుంచి వారి కుటుంబాలు దగ్గరగా ఉండటంతో అతడిని బంధువులా భావిస్తానని తెలిపింది.

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. ప్రణవ్ తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలాగే కళ్యాణి కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన లోకా చాప్టర్ 1 మంచి విజయాన్ని సాధించి ఆమెకు మరింత పేరు తెచ్చింది.

తెలుగు ప్రేక్షకులకు కూడా కళ్యాణి కొత్త కాదు. అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో ఆమె నటించి మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఆమె తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...