శ్రీ‌కాళేశ్వ‌ర దేవాల‌య అభివృద్దికి భారీ నిధులు…! ఆల‌య పున‌రుద్ద‌ర‌ణ‌కు సీఎం భూమి పూజ‌

Date:

రూ. 198కోట్ల‌తో అభివృద్ది ప‌నులు

 

జయశంకర్ భూపాలపల్లి, క్రైమ్ మిర్ర‌ర్: బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మేరకు 198 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు అధికారులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...