విచారణ ఖైదీ త్రివేణి మళ్లీ అరెస్ట్… ట్రేస్చేసి ప‌ట్టుకున్న హైద‌రాబాద్ పోలీసులు…!

Date:

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: హైదరాబాద్‌లో పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్న విచారణ ఖైదీ త్రివేణిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.హాస్పిటల్‌లో వైద్య పరీక్షల సమయంలో ఖైదీ త్రివేణి పోలీసుల కళ్లుగప్పి పరారైంది. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాతావాహన ఎక్సప్రెస్ ఎక్కి పారిపోయింది. పారిపోయే క్రమంలో తోటి ప్రయాణికురాలి మొబైల్ తీసుకుని బంధువులకు ఫోన్ చేసి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.

అయితే పోలీసులు చాకచక్యంగా ఆమె ప్రయాణ మార్గాన్ని ట్రేస్ చేశారు. విజయవాడ, భీమవరం వరకు వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరినట్లు గుర్తించారు. దిల్సుఖ్‌నగర్ ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో తలదాచుకున్న నిందితురాలు, చివరకు గచ్చిబౌలి లోని కేఫ్ కాఫీ డే వద్ద పోలీసులకు వచ్చిన టిప్-ఆఫ్‌తో పట్టుబడింది. చార్మినార్ టాస్క్ ఫోర్స్ & హుస్సేని ఆలం పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్ట్ జరిగింది. నిందితురాలి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, చేతి సంకెళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై BNS సెక్షన్ 262 కింద కేసు నమోదు చేసి (Cr.No.115/2026), నిందితురాలను కోర్టులో హాజరుపరిచి చంచల్ గూడా జైలుకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...