హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు బీజేపీ వర్గాలు తెలిపారు. ఈ పర్యటన వచ్చే నెల మొదటి వారంలో రానున్నట్లు తెలిపారు. ఏ రోజు వస్తారన్నది స్పష్టత రావాల్సి ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా కొన్ని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం జింఖానా గ్రౌండ్సులో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు. మోదీ పర్యటనపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.


